3 August, 2026 | 11:24 PM

కేకేవై జాతీయ రహదారికి ఆమోదం ఇవ్వాలి

03-08-2026 10:09 PM

కేంద్ర కేబినెట్ మంత్రి నితిన్ గట్కరిని కోరిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

కామారెడ్డి,(విజయక్రాంతి): కేకేవై జాతీయ రహదారికి ఆమోదం ఇవ్వాలని కోరుతూ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ ఘట్కరినీ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కలిసి విన్నవించారు. కేకేవై జాతీయ రహదారి అభివృద్ధి వల్ల తెలంగాణ ఉత్తర పద్యమ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించడంతోపాటు మహారాష్ట్రతో ఉన్న సంధానం మరింత బలపడుతుందని వివరించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ ప్రతిపాదనకు తక్షణ ఆమోదం తెలిపి పెండింగ్లో ఉన్న ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఎమ్మెల్యే వినతి పత్రం అందజేయడంతో త్వరలోనే ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి సానుకూల తను వ్యక్తపరిచినట్లు  ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు.