calender_icon.png 23 December, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుదీరిన కొత్త సర్పంచ్‌లు

23-12-2025 01:15:59 AM

మోతె, డిసెంబర్ 22 (విజయక్రాంతి): మండలలోని 259 గ్రామపంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా 29 గ్రామాల ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు.

దీనిలో మోతె గ్రామ సర్పంచ్ గా దోసపాటి అనురాధ,  హుస్సేనా బాద్ సర్పంచ్ గా అక్కిన పల్లి శ్రీరాములు, మామిళ్ళ గూడెం కొరవి నాగమణి,  కొత్తగూడెం గడ్డి కొప్పుల శేషి రెడ్డి, తుమ్మల పల్లి వాసం శెట్టి అరుణ,  రావి పహాడ్ కోడి లింగయ్య, సిరికొండ బొర్ర వెంకటేష్, గోప తండా భూక్యా బిక్కు నాయక్, నేరడవాయి దారమళ్ళ గోవర్ధన్,  అన్నారి గూడెం ఇంద్రాల సుప్రజ,  ఉర్లుగొండ మొక్క వెంకటేశ్వర్లు,  రాఘవ పురం మద్ది మంజుల, రాఘవ పురం ఎక్స్ రోడ్డు కోల లింగయ్య, నామ వరం దైద శ్రవణ్, అప్పన్న గూడెం సండ్ర ప్రసాద్, భల్లుతండా భూక్యా మల్సూర్, భిక్య తండా హలవత్ స్వామి, బోడబండ్ల గూడెం కాంపల్లి ఉమా, బుర్కాచర్ల ధరవత్ కవిత, గోల్ తండా ధారవత్ భారతి, కరకాయలగూడెం యాతకుల విజయలక్ష్మి, కూడలి బర్మవత్ మల్సూర్, లాల్ తండా తేజవత్ అండాలు, నర్సింహా పురం వాంకుడోత్ బేబీ, రాంపురం తండా బానోతు సత్తెమ్మ, రాయికుంటతండా భూక్యా ఉప్పయ్య, సర్వారం మూడు నాగేష్, తుమ్మ గూడెం కుక్క ధనమ్మ, విభళ్ళపురం గుండ్ల చంద్ర కళ, లు సర్పంచ్ లు గా ప్రమాణం చేసి భాద్యత లు చేపట్టారు. మండల కేంద్రంలో ఉప సర్పంచ్ గా బొక్క ఉపేందర్ రెడ్డి, గోపతండ ఉప సర్పంచ్ గా మాలోతు ఈశ్వరి రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  మండల అభివృద్ధి అధికారి టి ఆంజనేయులు, తహసీల్దార్ యం వెంకన్న, డి టి పుష్ప, ఆర్ ఐ లు కర్ణాకర్ రెడ్డి, రమేష్, ఏ ఓ అరుణ, ఏ ఇ ఓ లు పలు శాఖల అధికారులు సర్పంచ్ లు వార్డు సభ్యులకు ప్రమాణం చేయించారు.

అట్టహాసంగా ప్రమాణస్వీకారం 

మఠంపల్లి, డిసెంబర్ 22: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని 29 గ్రామ పంచాయతీ సర్పంచ్లు సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు.కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్లు బానోతు అరుణా దేశ్ పాండు నాయక్,మాలోతు సక్రు నాయక్ గ్రామ ప్రజలు కార్యకర్తలు యువత, వార్డు సభ్యులతో కలిసి ఊరేగింపు గా బయలుదేరి ఆయా గ్రామ పంచాయతీ లో స్పెషల్ ఆఫీసర్,కార్యదర్శి,ప్రజల సమక్షంలో సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ గా తమను ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని తెలియ జేశారు. అనంతరం హుజుర్ నగర్ మాజీ కౌన్సిలర్ న్యాయవాది జక్కుల వీరయ్య, మఠంపల్లి మండల మాజీ జెడ్పిటిసి సైదులు అతిథిలుగా హాజరై పాలకవర్గని సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఎంపిటిసిలు, నాయకులు,కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు.

తుంగతుర్తిలో 

తుంగతుర్తి, డిసెంబర్22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా అందులో భాగంగా తుంగతుర్తి మండలంలోని మొత్తం 24 గ్రామ పంచాయతీల సర్పంచులు, అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు.

తుంగతుర్తిలో సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, అన్నారం కుంచాల శ్రీనివాస్ రెడ్డి, సంగం సర్పంచ్ కలకోట్ల మల్లేష్ కరివిరాల సర్పంచ్ మోర సంధ్య కొత్తగూడెం సర్పంచ్  రమేష్ గానుబండ సర్పంచ్ వెంకటమ్మ,, తూర్పు గూడెం దాసరి ఎల్లమ్మ వెంపటి తప్పట్ల ఎల్ల య్య గొట్టిపర్తి మంజుల రామన్నగూడెం రాజశేఖర్ నాయక్ దేవుని గుట్ట తండా గుగులోతు స్వాతి భాస్కర్, వెలుగు పెళ్లి అశ్విని కన్నా రెడ్డి బండ రామారం కొరికొప్ప్లనరేష్గ్ గౌడ్, సూర్యతండ లకవాత్ బహుభయూ, గుడితండ గుగులత్ ఝాన్సీ మంచ్యతండలాకవత్ రాందాస్.బాపనీభవితండ సపావత్ బికోజి యనకుంటతండబాగ్యమ్మ, కాశితండ జటోత్ పులమ్మ రావులపల్లి జ్యోతి సింగరంతండ గుగులొథ్ సుధాకర్,రవులపల్లి చింతకుంట్లా మనోజ్,కేశవాపురం మిర్యాల శ్రీనివాస్,మానపురం.భాగ్యమ్మ లు ఆయా గ్రామపంచాయతీలో మండల అధికారుల పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

జాజిరెడ్డిగూడెం మండలంలో 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),డిసెంబర్22: మండలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీలకు సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులను గ్రామ ప్రత్యేక అధికారులు  ప్రమాణ స్వీకా రం చేయించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. మండల పరిధిలోని ఉ య్యాలవాడ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పాశం కరుణభాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే మందు ల సామేలు అభినందించి సన్మానించారు.

గరిడేపల్లిలో

గరిడేపల్లి, డిసెంబర్ 22, (విజయక్రాంతి) :మండలంలోని 33 గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా నూతన సర్పంచులు మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిల బెట్టుకుంటూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని,ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. పారదర్శక పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, త్రాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచుల్లో మేకపోతుల వెంకటమ్మ, బొల్లెపల్లి రామనాథం,మాశెట్టి నాగలక్ష్మి,కీత వెంకటేశ్వర్లు,కడియాల పద్మ అప్పయ్య, గుండు రామాంజిగౌడ్, చింతకాయల వినోద నాగేశ్వరరావు, కీసరి వెంకటరమణ బుచ్చిబాబు, చెనగాని సాంబయ్య, కటకం వేణు, బచ్చలకూరి శీను, ఎడవల్లి కమలమ్మ,నందిపాటి కవిత, మాలోతు సుధాకర్, బానోతు అరు ణ, కాచవరపు నరసింహారావు, సండ్రపంగు బజారమ్మ, మచ్చ ముత్తమ్మ, సకినాల సైద మ్మ, కందుల మంగమ్మ, నకిరేకంటి సుధ, ఆకుల కృష్ణ, బోడ సైదిరెడ్డి,వంకుడోతు శారద, కుసుమ నర్సిరెడ్డి,బత్తిని అంజయ్య, కరణం భద్రయ్య ,కేతేపల్లి నర్సయ్య, బొలిశెట్టి లక్ష్మమ్మ, కట్టా కల్యాణి,బానోతు సరోజ, గుగులోతు లకుపతి, కుర్రి మహేష్,ఉన్నారు.  

నిరంతరం కృషి చేస్తాం

చండూరు, డిసెంబర్22( విజయ్ క్రాంతి):  గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామనినేర్మ ట సర్పంచ్ నారాపాక వసంత ధనయ్య అన్నారు. సోమవారం చండూరు మండల పరిధిలోనినేర్మ ట గ్రామంలో సోమవారం రోజున నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచి నారపాక వసంత ధనయ్య, ఉపసర్పంచి నందికొండ మమతారెడ్డిమరియు వార్డ్ మెంబర్లతో   ప్రత్యేక అధికారి చంద్రికప్రమాణ స్వీకారం  చేయించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడు తూ, అభివృద్ధి సంక్షేమ పనులు  చేసి గ్రామాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతమని, గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిది ద్దుతామని అన్నారు.

గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్ కి వార్డు మెంబర్లకు శాలువాతో గ్రామ ప్రజలు, ఘనంగా సన్మానించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకన్న,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బురకల భిక్షమయ్య గౌడ్, మాజీ సర్పంచ్ లు సత్తిరెడ్డి, నందికొండ నరసింహారెడ్డి, నారపాక శంకరయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుమోహన్, ఉపాధ్యాయులు శ్రీను,గ్రామ ప్రజలు బురకల ఎలక్షన్, కొంపెల్లి శంకర్,బుర్కల శ్రీనివాస్ గౌడ్, నారపాక నరసింహ, ఓర్స్ మల్లేశం, ఓర్స్ బాలరాజ్,వార్డు మెంబర్లు జెర్రిపోతుల ధనంజయ, నారాపాక దశరథ, బురుకల రాజ్ కుమార్, దోమలపల్లి బిక్షమయ్య, ఈరటి సైదులు, బండమీది వెంకట య్య, బురకల వసంత, బల్లెం కవిత, ఓర్సు రోహిణి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వేములపల్లిలో

వేములపల్లి, డిసెంబర్ 22 (విజయక్రాంతి): మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వేములపల్లి- సందీప్, బుగ్గ బావి గూడెం-లక్ష్మి, అన్నపురెడ్డిగూడెం -శ్రీదేవి, శెట్టిపాలెం- సైదు లు, మొల్కపట్నం- మౌనిక ,రావులపెంట- చంద్రయ్య, సల్కునూరు- సతీష్, మంగాపురం -చక్కని ఉపేంద్రమ్మ సత్యం ,లక్ష్మీదేవి గూడెం _భరత్ ,ఆమనగల్లు- సందీప్, కామపెల్లి గూడెం- మమత ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. మండలంలోని కొలువుదీరిన  నూతన పాలకవర్గాలకు పలువురు అభినందనలు తెలియజేశారు.

మాజీ మంత్రి తండ్రి సర్పంచ్‌గా.. 

సూర్యాపేట, డిసెంబర్ 22 (డిసెంబర్) : జిల్లాలోని నాగారం గ్రామపంచాయతీ సర్పంచ్ గా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సోమవారం సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 95 ఏండ్ల వయసులో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ నిలిచి అంద రినీ ఆకర్షించిన రామచంద్రారెడ్డి సర్పంచ్ గా గెలుపొందడంతో ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఆయనను పలువురు అభినందించారు. తదుపరి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పలు హామీలను నెరవేర్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న,  జూలూ రి గౌరీ శంకర్, కట్ట శేఖర్ రెడ్డి, బిజేపీ ఇంచా ర్జ్ కడియం రామచంద్రయ్య లతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యు లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.