23-12-2025 01:20:11 AM
కోదాడ, డిసెంబర్ 22 : నూతన హాస్పిటల్ భవన నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కోదాడ పట్టణంలో 26 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్పిటల్ లో అందుతున్న డయాలసిస్ సేవల గురించి అడిగి తెలుసుకోగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే డయాలసిస్ సేవలు అందించటంలో ప్రథమ స్థానంలో ఉండటంతో సిబ్బందిని అభినందించారు.
ప్రభుత్వ హాస్పిటల్లో సాధారణ ప్రసూతి సేవలు పెంచే విధంగా వైద్యులు,సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రమాదం నుండి ప్రజలు ఎలా అప్రమత్తం అవ్వాలో మాక్ డ్రిల్ కార్యక్రమం ద్వారా అవగాహనా కల్పించటం జరిగిందని తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ అలాగే తెలంగాణ ఆదేశాల మేరకు సోమవారం కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డు లోని పెద్ద చెరువు వద్ద మాక్ డ్రిల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మాక్ డ్రిల్ ఎక్స్సజ్‌లో భాగంగాలో పెద్ద చెరువులో అగ్నిమాపక సిబ్బంది, ఎస్డిఆర్‌ఎఫ్ వాలంటీర్లు, వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను ఏ విధంగా కాపాడాలో ప్రత్యక్షంగా మాక్ డ్రిల్ లో ప్రదర్శించారు. ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగిపోతుండగా వారిని కాపాడారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కె సీతారామరావు, ఆర్డీవో సూర్యనారాయణ, డిఎంహెచ్‌ఓ వెంకటరమణ, హాస్పటల్ సూపర్డెంట్ దశరథ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి,తహసిల్దార్ వాజిద్ అలీ, అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి, డీఎస్‌ఓ మోహన్ బాబు, డిప్యూటీ సీఈవో శిరీష, డివైఎస్‌ఓ వెంకటరెడ్డి, జిల్లా వెటర్నరీ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు