పీఎన్‌బీ హౌసింగ్ లాభం 57% వృద్ధి
01-05-2024 12:05 AM
న్యూఢిల్లీ ఏప్రిల్ 29: పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో గత ఏడాది ఇదేకాలంతో పోలి స్తే 57 శాతం వృద్ధిచెంది రూ.444 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా ఇది 28 శాతం పెరిగింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో నికర వడ్డీ మార్జి న్లు పెరగడం, ఆస్తుల నాణ్యత మెరుగుపడటంతో లాభాలు భారీగా వృద్ధి చెందాయి. కంపెనీ వడ్డీ ఆదాయం రూ.1,580 కోట్ల నుంచి రూ.1,684 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదా యం శాతం వృద్ధితో రూ.632 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ సీక్వెన్షియల్‌గా 3.49 శాతం నుంచి 3.65 శాతానికి చేరింది. అయితే గత ఏడాది క్యూ4లో సాధించిన 3.75 శాతంకంటే తగ్గింది.






