పల్స్ ఫీల్ అబ్లేషన్‌తో కొత్త జీవితం
* ఏట్రియల్ ఫైబ్రిలేషన్‌తో పాటు ఇతర గుండె లయ లోపాలతో బాధపడుతున్న 31, 84 ఏళ్ల వయస్సున్న ఇద్దరికి అత్యాధునిక ‘పల్స్ ఫీల్ అబ్లేషన్ (పీఎఫ్ ఏ)’ చికిత్సతో యశోద హాస్పిటల్స్ వైద్యులు కొత్త జీవితాన్ని అందించారు. వారు కోలుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు.
గుండె లయ వ్యాధుల చికిత్సలో మరో కీలక మైలురాయిని అధిగమిస్తూ, యశోద హాస్పిటల్స్- సికింద్రాబాద్‌లో అత్యాధునిక పల్స్ ఫీల్ అబ్లేషన్ సాంకేతికతను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్న మెడ్ట్రానిక్ అభివృద్ధి చేసిన పల్స్ సెలెక్ట్ పల్స్ ఫీల్ అబ్లేషన్ సిస్టం సహాయంతో క్లిష్టమైన గుండె రిథమ్ (గుండె కర్ణికల అసమాన స్పందన) లోపాలతో బాధపడుతున్న 31, 84 ఏళ్ల ఇద్దరికి ఈ అత్యాధునిక విధానాన్ని విజయవంతంగా నిర్వహించారు.
పల్స్ ఫీల్ అబ్లేషన్ అనేది ముఖ్యంగా ఎట్రియల్ ఫైబ్రిలేషన్ గుండె కర్ణికల అసమాన స్పందన వంటి గుండె రిథమ్ లోపాల చికిత్సలో ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక విధానం. ఇది నియంత్రిత విద్యుత్ పల్స్ ద్వారా గుండెలో అసాధారణ విద్యుత్ సంకేతాలను సృష్టించే కణజాలాన్ని మాత్రమే ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకొని చికిత్స అందిస్తుంది.
సాదారణ థర్మల్ అబ్లేషన్ విధానాలతో పోలిస్తే, ఈ సాంకేతికత ద్వారా అన్నవాహిక, ఫ్రెనిక్ నర్వ్ వంటి సమీప అవయవాలకు హాని కలిగే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా చికిత్స మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, రోగులు త్వరగా కోలుకుని సాధారణ జీవితానికి చేరుకునే అవకాశం ఉంటుంది
ఇద్దరికి పీఎఫ్‌ఏ చికిత్స
ఈ అత్యాధునిక సాంకేతికతతో యశోద హాస్పిటల్స్ -సికింద్రాబాద్‌లో పదేపదే గుండె దడ, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతున్న 31 ఏళ్ల యువకుడిని పరీక్షించగా, అతనికి ఎడమ ఎట్రియల్ టాకీకార్డియాతో కూడిన పారాక్సిస్మల్ ఎట్రియల్ ఫైబ్రిలేషన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం అత్యాధునిక పీఎఫ్‌ఏ విధానాన్ని నిర్వహించగా, చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకొని, ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నా రు. అలాగే, తీవ్రమైన ఆయాసం కారణంగా ఇటీవల ఆసుపత్రిలో చేరిన 84 ఏళ్ల వ్యక్తిని పరీక్షించగా, ఆయనకు నిరంతర ఎట్రియల్ ఫైబ్రిలేషన్ ఉన్నట్లు గుర్తించారు.
ఆయనకు కూడా పీఎఫ్‌ఏ విజయవంతంగా నిర్వహించారు. చికిత్స అనంతరం గుండె రిథమ్ సాధారణ స్థితికి చేరుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడి, గుండె స్పందన సాధారణ స్థితికి చేరడంతో స్థిరమైన ఆరోగ్య పరిస్థితిలో డిశ్చార్జ్ చేశారు. ఈ విజయవంతమైన ప్రక్రియను డాక్టర్ ఎంఎస్ చంద్రమౌళి, సీనియర్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్ -సికింద్రాబాద్ ఎలక్ట్రోఫిజియాలజీ బృందంతో కలిసి నిర్వహించారు.
విప్లవాత్మక ముందడుగు
యశోద హాస్పిటల్స్ -సికింద్రాబాద్ సీనియర్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంఎస్ చంద్రమౌళి మాట్లాడుతూ.. ‘పల్స్ ఫీల్ అబ్లేషన్ గుండె రిథమ్ వ్యాధుల చికిత్సలో ఒక విప్లవాత్మక ముందడుగు’ అన్నారు. మెడ్ట్రానిక్ అభివృద్ధి చేసిన పల్స్ సెలెక్ట్ పల్స్ ఫీల్ అబ్లేషన్ సిస్టం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో, మరింత సురక్షితంగా ఎట్రియల్ ఫైబ్రిలేషన్‌కు చికిత్స అందించగలుగుతున్నాము. ప్రపంచ స్థాయి వైద్య సాంకేతికతను మన దేశ రోగులకు అందుబాటులోకి తీసుకురావడం యశోద హాస్పిటల్స్ లక్ష్యం అన్నారు.






