12 July, 2026 | 1:14 PM

కోరిక తీర్చాలేదని.. కూతుర్ని హతమార్చిన తండ్రి

19-06-2024 04:44 PM

హైదరాబాద్: మియాపూర్ బాలిక అనుమానాస్పద కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. బాలిక వసంతని తండ్రే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కోరిక తీర్చాలని తండ్రి కూతుర్ని బలవంతం పెట్టాడు. దీంతో బాలిక అమ్మకు చెప్తానని గట్టిగా కేకలు వేసింది. కోపంతో కన్న కూతుర్నే  తండ్రి నరేష్ హతమార్చాడు. నడిగడ్డ తండాలో పొదల్లోకి తీసుకెళ్లి జట్టు పట్టుకుని నేలకేసి కొట్టి దారుణంగా హత్య చేశాడు. బాలిక మిస్సింగ్ మిస్టరీ వారం రోజుల తర్వాత బయటపడింది.ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.