12 July, 2026 | 1:49 PM

మెకానిక్ షెడ్డులో అగ్నిప్రమాదం

12-07-2026 01:00 PM

విజయవాడ: విజయవాడలోని ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.   మెకానిక్ షెడ్డులో ఆకస్మత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మెకానిక్ షెడ్డులో పార్కింగ్ చేసి ఉన్న ప్రైవేట్ బస్సులకు మండలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో ప్రాణభయంతో స్థానికులు, వాహనదారులు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్యాటరీ టెర్మినల్స్ వద్ద లేదా షెడ్డులోని వైరింగ్ లో సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.