calender_icon.png 18 July, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురికి కాలువలో పసికందు మృతదేహం...

18-07-2025 02:06:40 PM

  1. మెడికల్ కళాశాల సమీపంలోని ఘటన
  2. పెద్దపల్లి జిల్లా లో గోరం..

గోదావరి ఖని, (విజయక్రాంతి): నవ మాసాలు మోసి జన్మనిచ్చిన పసికందు ఈ లోకం చూడకముందే... ఆ తల్లికి ఎంత పెద్ద కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ... అమ్మ అనే పదానికి కళంకం తెచ్చే విధంగా...  పుట్టిన పసికందును మురికి కాల్వలో పడేసి వెళ్లిన హృదయ విదారకర సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం వెలుగు చూసింది. అది కూడా మెడికల్ కళాశాల సమీపంలోనే జరగడం విచారకరం. 

 ఈ సంఘటనను చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ సమీపంలోని రాజ్యలక్ష్మి కాలనీ మురికి కాలువలో ఓ పసికందు మృతదేహం తేలియాడుతుందిని, గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే 1-టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్నీ వెలికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.