calender_icon.png 18 July, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తో ఫుట్‌బాల్ ఆడటం ఖాయం: కేటీఆర్

18-07-2025 02:03:33 PM

  1. నేను జీవితంలో ఏనాడు సిగరేట్ కూడా తాగలేదు
  2. నేను ఏం చేసినా.. బాజాప్త చేస్తా
  3. లీక్‌లు తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదు..
  4. దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్‌ చేయించండి..
  5. ఎక్కడకు రమ్మంటావు? కొడంగల్‌కి రమ్మంటావా?
  6. ఏ టెస్ట్ అయినా పెట్టండి, ఎక్కడికైనా వస్తాను.
  7. నేను లోకేష్‌ను కలవలేదు.. కలిస్తే తప్పేంటి?
  8. లోకేష్‌ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం నాకేం ఉంది?

  9. హైదరాబాద్: దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలని, తాను జీవితంలో ఏనాడు సిగరెట్ కూడా తాగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) శుక్రవారం నాడు ఖమ్మం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. రేవంత్ రెడ్డి 20 నెలల్లో చేసింది శూన్యం అన్నారు. నా విషయంలో ఓసారి డ్రగ్స్ అంటారు, ఓసారి కార్ రేసింగ్ అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో నా హస్తముందని ఇప్పటివరకు ఎవరైనా చెప్పారా?, గాసిప్ ల మాయలో పడి.. ఆరు గ్యారంటీలను మర్చిపోద్దామా? అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారు.. గుండు సూదంత ఆధారం కూడా చూపలేదన్నారు. ధైర్యం ఉంటే ఏం ఆధారాలు ఉన్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వల్ల యూట్యూబర్లకు మినహా ఎవరకీ లాభం చేకూరలేదని చెప్పారు. దుబాయ్ లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం అన్నారు.

నేను ఏం చేసినా.. బాజాప్త చేస్తానని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. నేను లోకేశ్ ను కలవలేదు.. కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. లోకేశ్ నాకు మంచి మిత్రుడు.. ఆయనతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. లోకేశ్ పక్క రాష్ట్రం మంత్రి.. నాకు తమ్ముడులాంటి వారనిచెప్పారు. బనకచర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. కేంద్ర సమావేశం అజెండాలో బనకచర్ల అంశమే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. బనకచర్ల అంశమే(Banakacherla issue)  ప్రధాన అజెండాగా సమవేశం జరిగిందని ఏపీ మంత్రి చెప్పారని వెల్లడించారు. ఢిల్లీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి మరోసారి ద్రోహం చేశారని ఆరోపించారు. చంద్రబాబుతో(Chandrababu Naidu) చీకటి ఒప్పందం చేసుకుని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని చెప్పారు.రైతుల బాగు కోసం కేసీఆర్ పదేళ్లపాటు ఎంతో తాపత్రయపడ్డారని గుర్తుచేశారు. 420 హామీల విషయంలో కాంగ్రెస్ తో ఫుట్ బాల్ ఆడటం ఖాయం అన్నారు.