18-07-2025 02:08:59 PM
పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ శాసనసభ్యులు కంచర్ల
నల్లగొండ టౌన్ జులై18 (విజయక్రాంతి): మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు(Jagadish Reddy birthday celebrations) శుక్రవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ , నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కట్ చేశారు. ఈ సందర్భంగా రామావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ... ఉద్యమకాలం నుండి కూడా కేసీఆర్ కి వెన్నంటి ఉంటూ, ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేసారని పేర్కొన్నారు. ఎవరిన్ని కుట్రలు పన్నిన వారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం సంతరించుకుంటుందని వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామని అన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా పక్షాన జగదీష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..
నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఉమ్మడి నల్గొండ జిల్లాను సమర్థవంతమైన తన నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జేశారని అన్నారు. వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి మరింతగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి పాటుపడే విధంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.ఈ సందర్భంగా నల్లగొండ నియోజకవర్గ పార్టీ పక్షాన ప్రజల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కనగల్, తిప్పర్తి, నల్లగొండ,మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి,ముఖ్య నాయకులు, సింగం రామ్మోహన్ బక్క పిచ్చయ్య, కంచనపల్లి రవీందర్ రావు, కొండూరు సత్యనారాయణ, రావుల శ్రీనివాస్ రెడ్డి,మారగోని గణేష్, జమాల్ ఖాద్రి, మెరుగు గోపి,అన్వర్ పాషా, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, తుమ్మల లింగస్వామి బొజ్జ వెంకన్న, రంజిత్, దండంపెల్లి సత్తన్న, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి బడుపుల శంకర్,పేర్ల అశోక్, పెరిక యాదయ్య, భాస్కర్, బీపంగి యాదయ్య బి పంగి కిరణ్, బొమ్మరబోయన నాగార్జున, లతోపాటు భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.