14 April, 2026 | 4:59 PM

Breaking News

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •   కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!   •  

లక్షెట్టిపేట మున్సిపాలిటీలో గెలిచింది కొత్త వారే

14-02-2026 05:17 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో 15 వార్డులలో దాదాపు అందరు కొత్త వారే కౌన్సిలర్లుగా విజయం సాధించారు. 15 వార్డులకు 14 మంది కొత్త వారు కాగా ఒక్కరు (12వ వార్డు అభ్యర్థి పర్వీన్ సుల్తాన ఆరిఫ్ ) మాత్రమే పాతవారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన 11 అభ్యర్థుల్లో 10 మంది కొత్త వారే కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు కొత్త వారే, బీజేపీ నుంచి మొదటి సారి గెలుపొందిన అభ్యర్థి సైతం నూతనంగా ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొన్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ నుంచి పాత అభ్యర్థి ఒకరు కో ఆప్షన్ సభ్యులుగా ఉన్నారు. మొత్తానికి లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 14 మంది కొత్త వారే విజయం సాధించిన 16న ప్రమాణ స్వీకారం చేసి మున్సిపాలిటీలో అడుగుపెట్టబోతున్నారు.