30 June, 2026 | 11:58 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ప్రజల పక్షాన పత్రికలు నిలబడాలి

22-01-2026 12:04 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 21(విజయక్రాంతి): ప్రజల పక్షాన పత్రికలో నిలబడాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం  విజయక్రాంతి దినపత్రిక ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన నివాసంలో స్టాఫ్ రిపోర్టర్ చిప్ప సురేష్, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనతి కాలంలోనే విజయ క్రాంతి దినపత్రిక ప్రజల మన్ననలు పొందిందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.

జర్నలిజం అన్ని రంగాలపై దృష్టి సారించి ప్రజల పక్షాన నిలవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ కె.హరిత తన చాంబర్లో విజయ క్రాంతి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మీడియా కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో వాంకిడి రిపోర్టర్ రహీద్ పాషా, సింగిల్ విండో మాజీ చైర్మన్ అలీబిన్ హైమద్, రాజంపేట సర్పంచ్ పోచయ్య, వాంకిడి సర్పంచ్ సతీష్, నాయకులు జీవన్ తదితరులు పాల్గొన్నారు.