calender_icon.png 22 January, 2026 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెన్ జిమ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

22-01-2026 12:04:15 AM

మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి

చిగురుమామిడి, డిసెంబర్ 21(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించనున్న ఓపెన్ జిమ్ లను విద్యార్థులు,యువత సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి,గ్రామ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్యలు కోరారు. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామంలోని మోడల్ స్కూల్లో,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఓపెన్ జిమ్ల ఏర్పాటుకు ఒక్కో పాఠశాలకు రూ. 5లక్షల చొప్పున మొత్తం రూ.10లక్షలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు వారు చెప్పారు.

రెండు పాఠశాలల్లో ఓపెన్ జిమ్ లకు కొబ్బరికాయలు కొట్టి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పావని,ఉపసర్పంచ్ పైడిపల్లి వెంకటేష్,ఏఈ రమేష్, టీజీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హర్జిత్ కౌర్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి,కాంట్రాక్టర్ మహేందర్, మోడల్ స్కూ ల్ విద్యా కమిటీ చైర్మన్ స్వర్ణ,వార్డు మెంబర్లు గట్టు రేణుక,పిట్టల తిరుపతి,జెట్టి లత, కీర్తన,మర్రి విజయలక్ష్మి చంద్రశేఖర్,రజాక్,తిరుపతి,రాము,సృపిత్ తోపాటు నాయకులు పూదరి వేణు గోపాల్,పిట్టల రాజు,సతీష్, ఆనంద్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.