22-01-2026 12:03:09 AM
జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ పకడ్బందీగా అమలు
రాజన్న సిరిసిల్ల, జనవరి 21 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ ని బంధనను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.ఈనేపథ్యంలో పోలీస్ అధికారులు పెట్రో ల్ బంక్ యజమానులు,సిబ్బందితో సమావేశాలు నిర్వహించి, హెల్మెట్ లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్‌పోయావద్దని అవగాహన కల్పించి, ప్రతి పెట్రోల్ బంక్ వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.
వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని,ముఖ్యంగా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.