2 September, 2026 | 10:26 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

నిఖత్ పసిడి పంచ్

19-05-2024 | 01:17am

ఎలోర్డా బాక్సింగ్ టోర్నీ

అస్తానా (కజకిస్థాన్): భారత స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ ఎలోర్డా కప్‌లో పసిడి పతకం కైవసం చేసుకుంది. రింగ్‌లో వరుస పంచ్‌లతో విరుచుకుపడిన తెలంగాణ అమ్మాయి.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. నిఖత్‌తో పాటు భారత్ నుంచి మీనాక్షి కూడా బంగారు పతకం సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన ఈ టోర్నీలో భారత బాక్సర్లు 12 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నారు. ఇందులో రెండు స్వర్ణాలు, 2 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. మహిళల 52 కేజీల ఫైనల్లో నిఖత్ 5 జజీరా (కజకిస్థాన్)పై గెలుపొందింది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం పట్టడేమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నిఖత్.. స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తాచాటగా.. 48 కేజీల తుదిపోరులో మీనాక్షి 4 సైధాన్ (ఉజ్బెకిస్థాన్)పై గెలుపొందింది. చివరి రోజు పోటీల్లో అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) రజత పతకాలు గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో సోయిబమ్ (48 కేజీలు), అభిషేక్ (67 కేజీలు), విశాల్ (86 కేజీలు), గౌరవ్ (ప్లస్ 92 కేజీలు) కాంస్యాలు చేజిక్కించుకోగా.. మహిళల విభాగంలో సోను (63 కేజీలు), మంజు (66 కేజీలు), షలఖ (70 కేజీలు), మోనిక (ప్లస్ 81 కేజీలు) కంచు మోత మోగించారు.