2 September, 2026 | 11:27 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

రోహిత్ మాటే.. నా మాట

19-05-2024 | 01:14am

ఇంపాక్ట్ ప్లేయర్‌పై విరాట్ కోహ్లీ

బెంగళూరు: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను వ్యతిరేకించే వారి జాబితా రోజు రోజుకు పెరిగిపోతోంది. జట్టు సమతూల్యాన్ని దెబ్బతీసే ఈ రూల్ వల్ల ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం తగ్గుతోందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొనగా.. తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హిట్‌మ్యాన్ అభిప్రాయంతో ఏకీభవించాడు. ‘ఆటలో వినోదాన్ని పెంచేందుకు తెచ్చిన నిబంధన సమతూల్యాన్ని దెబ్బతీస్తోంది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. చాలా మంది ఇదే అంటున్నారు. ఇలా ఉంటే బౌలర్లు మాత్రం ఏం చేయగలరు. ఒక అదనపు బ్యాటర్ అందుబాటులో ఉండటంతో ప్రతి ప్లేయర్ స్వేచ్ఛగా ఆడుతాడు. దీంతో భారీ స్కోర్లు సాధ్యపడుతున్నాయి. నా వరకు వస్తే.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు కూడా నాణ్యమైన బ్యాటర్ ఉండటంతో నేను పవర్ ప్లేలో 200 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నా. ఈ స్థాయి క్రికెట్‌లో బంతికి, బ్యాట్‌కు మధ్య బ్యాలెన్స్ లేకుంటే బాగుండదు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన శాశత్వం కాదన్న వ్యాఖ్యలను కోహ్లీ స్వాగతించాడు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశాడు.