2 September, 2026 | 9:35 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

టైటిల్‌కు అడుగు దూరంలో

19-05-2024 | 01:20am

ఫైనల్ చేరిన సాత్విక్ జోడీ

థాయ్‌లాండ్ ఓపెన్ 

బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ శెట్టి థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో శనివారం సాత్విక్ జంట 21 21 మింగ్ చె లూ కెయి (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడిన భారత షట్లర్లు కేవలం 35 నిమిషాల్లోనే పని పూర్తి చేశారు. 2019లో తొలిసారి ఇక్కడే సూపర్ టైటిల్ చేజిక్కించుకున్న ఈ జోడీ.. సెమీస్‌లో అదే జోరు కొనసాగించింది. ‘ఈ టోర్నీలో మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. వరుస విజయాలు లయ దొరకబుచ్చుకునేందుకు దోహద పడతాయి. థాయ్‌లాండ్‌లో ఆడటం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. మేం ఇక్కడే కెరీర్‌లో తొలి టైటిల్ అందుకున్నాం’ అని సాత్విక్ అన్నాడు. ఆదివారం జరగనున్న తుదిపోరులో చైనీస్ జోడీతో మనవాళ్లు అమీతుమీ తేల్చుకోనున్నారు. మహిళల డబుల్స్‌లో ఆశలు రేపిన అశ్విని పొన్నప్పతనీషా సెమీస్‌లో ఓటమి పాలయ్యారు.