25 May, 2026 | 8:50 AM

ఆస్కీ డైరెక్టర్ జనరల్ గా డా. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

20-08-2024 11:19 AM

హైదరాబాద్:  అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని బెల్లావిస్టా క్యాంపస్‌ లో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆస్కీ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా కొనసాగిన రమేశ్ కు మార్ తాజాగా అదే సంస్థ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు తీసుకున్నారు.