5 June, 2026 | 2:34 AM

అవినీతికి పాల్పడుతున్న బీరప్ప నిమ్స్ డైరెక్టర్‌ను బర్తరఫ్ చేయాలి

05-06-2026 01:03 AM

పలు దళిత, బీసీ సంఘాల డిమాండ్

ముషీరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్పను రాష్ట్ర ప్రభుత్వం భర్తరఫ్ చెయ్యాలని పలు దళిత బీసీ సంఘాలు డిమాండ్ చేసాయి. ఈ మేరకు గురువారం హైదర్ గూడ లోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు దళిత, బీసీ సంఘాల నేతలు బీరప్ప అవినీతి అక్రమాలకు తెలియజేస్తూ సీఎంకు బహిరంగ లేఖ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా  బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్, సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పోకల కిరణ్ లు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో అందరిని బదిలీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిమ్స్ డైరెక్టర్ ను ఎందుకు మార్చడం లేదో వారు ప్రశ్నించారు. బీరప్ప పై విజిలెన్స్ విచారణ జరిపించి తక్షణమే పదవీ నుండి తొలిగించి నిజాయితీ పరుడు అయిన దళిత నేత కు డైరెక్టర్ పదవీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు సంఘాల నేతలు గొల్లపల్లి దయానంద రావు, ఇక్బాల్, లక్ష్మి పార్వతి, రాజేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.