04-12-2025 01:06:12 AM
నంగునూరు, డిసెంబర్ 3: దేశ సేవకు అంకితమయ్యేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక అగ్నివీర్ పథకంలో శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి నంగునూరు మండల యువకులు తమ కలల ఉద్యోగ పట్టాలను కైవసం చేసుకున్నారు. మండల పరిధిలోని కొండంరాజపల్లి గ్రామానికి చెందిన బండి శ్రీనివాస్, పాలమాకుల గ్రామానికి చెందిన తోకల సంతోష్, మద్దూంపూర్ గ్రామానికి చెందిన రాహుల్ ఆరు నెలలకు పైగా సాగిన కఠోర శిక్షణలో తమ సత్తాను నిరూపించుకున్నారు.
బుధవారం బెంగళూరులోని ఆర్మీ సర్వీస్ కారప్స్ సెంటర్లో పోస్టింగ్ చేరడానికి సంబంధించిన ఉద్యోగ పట్టాలను అందుకున్నారు.యువకుల విజయం వెనుక తల్లిదండ్రుల కష్టం, నిరంతర ప్రోత్సాహం ఎంతో ఉంది. పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా,తమ బిడ్డలను దేశ సైన్యంలో చూడాలనే వారి కల ఈ రోజు సహకారమైందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా,బంధుమిత్రులు,పలువురు గ్రామస్తులు ఈ యువ వీరులకు అభినందనలు తెలియజేశారు.