calender_icon.png 25 December, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

25-12-2025 11:01:02 AM

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో చిత్రదుర్గం జిల్లా జవరగుండనహళ్లి శివారులో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది.  వేగంగా దూసుకొచ్చిన లారీ డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. బస్సు డీజిల్ ట్యాంక్ వద్దే లారీ ఢీకొనడంతో వెంటనే మంటలు చేలరేగాయి. బస్సులో భారీగా మంటలు చెలరేగి 9 మంది మృతి చెందారు. బస్సును ఢీకొట్టిన ఘటనలో లారీ డ్రైవర్ కూడా మృత్యువాతపడ్డాడు. బస్సులో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు.

గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. సిరా- హిరియూరు మధ్య జాతీయరహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  "ఆ ట్రక్కు రోడ్డు డివైడర్ అవతలి వైపు నుండి వచ్చి ఢీకొట్టింది. అది అతివేగంతో వస్తోంది. ఆ సమయంలో నేను 60-70 (కిలోమీటర్ల) వేగంతో వెళ్తున్నాను. ఎదురుగా వాహనం రావడం నేను చూశాను. ఆ తర్వాత ఆ వాహనం (ట్రక్కు) బస్సును ఢీకొట్టడం మాత్రమే నాకు గుర్తుంది, ఆ తర్వాత ఏం జరిగిందో, నన్ను ఎలా బయటకు తీశారో నాకు తెలియదు," అని చికిత్స పొందుతున్న బస్సు డ్రైవర్ రఫీక్ విలేకరులతో చెప్పాడు.

చిత్రదుర్గ బస్సు ప్రమాద బాధితుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అగ్నిప్రమాదంలో మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రమాదం జరిగిన వార్త విని దిగ్భ్రాంతికి గురైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.