25-12-2025 12:05:53 PM
భువనేశ్వర్: ఒడిశాలోని(Odisha) కంధమాల్ జిల్లా గుమ్మా అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో(Encounter) ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు గురువారం తెలిపారు. ఘటనాస్థలిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం సీఆర్పీఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. బుధవారం రాత్రి బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అడవిలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఇద్దరు పురుష నక్సలైట్లను సీపీఐ (మావోయిస్ట్) ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాకేష్, దళ సభ్యుడు అమృత్‌గా గుర్తించామని, వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వారిద్దరి తలలపై కలిపి రూ. 23.65 లక్షల రివార్డు ఉందని సూచించారు.