25-12-2025 10:28:51 AM
హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) క్రిస్టియన్ సోదర, సోదరీమణులు అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తు బోధనల స్ఫూర్తితో పనిచేస్తున్న తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం, క్రైస్తవ సమాజ సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.