25-12-2025 10:43:08 AM
చెన్నై: తమిళనాడులో(Tamil Nadu) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కడలూరులో వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, ఇద్దరు పిల్లలు సహా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు టైరు పేలి అదుపుతప్పింది. ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు, గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.