భూపాలపల్లి జిల్లాలో తొమ్మిది మంది ఎస్‌ఐల బదిలీలు
జయశంకర్ భూపాలపల్లి, (మహబూబాబాద్) మార్చి 10 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ఎస్ ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రామగుండం సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం మొగుళ్లపల్లి ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న బి. అశోక్ గణపురం ఎస్‌ఐగా, టేకుమట్ల ఎస్ ఐ డి.సుధాకర్ రేగొండ ఎస్ ఐ గా, చిట్యాల ఎస్‌ఐ జీ.శ్రావణ్ కుమార్ భూపాలపల్లి సెకండ్ ఎస్ ఐ గా, గణపురం ఎస్‌ఐ ఆర్. అశోక్ భూపాలపల్లి వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు, కొత్తపల్లి గోరి ఎస్ ఐ ఎస్.దివ్య భూపాలపల్లి వీఆర్ ఎస్ ఐ గా, ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్ లో ఉన్న ఎస్ ఐ సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి కొత్తపల్లిగోరి ఎస్త్స్రగా, వీఆర్ లో ఉన్న ఎస్‌ఐ పీ.సతీష్ చిట్యాల ఎస్ ఐ గా, ప్రస్తుతం ములుగులో వీఆర్ లో ఉన్న ఎస్ ఐ ఎం. సురేష్ మొగుళ్లపల్లి ఎస్ ఐ గా నియమితులయ్యారు.




