హెల్మెట్ బరువు కాదు బాధ్యత
మంగపేట, మార్చి 10 ( విజయక్రాంతి): హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని, ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రత పాటిస్తే సురక్షిత ప్రయాణాలు సాగించవచ్చని ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్త్స్ర టీ.వీ.ఆర్ సూరి అన్నారు. మంగపేట ఎస్త్స్ర టీ.వీ.ఆర్ సూరి ఆధ్వర్యంలో మండలంలోని చుంచుపల్లిలో డ్రగ్స్, రోడ్డు భద్రతపై స్థానికులకు, వాహనదారులకి మం గళవారం అవగాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్త్స్ర టీ.వీ.ఆర్ సూరి మాట్లాడుతూ సాధారణంగా అతి వేగం, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరు గుతుంటాయని అన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్ తో విలువైన ప్రాణాలు కోల్పోవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.
రోడ్డు భద్రత నియమాలను ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, చెడు వ్యసనాలు గంజాయి, మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలు లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.




