11 March, 2026 | 6:21 PM

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

11-03-2026 12:00 AM

జనగామ, మార్చి 10 (విజయక్రాంతి): ప్రాణాంతకమైన మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని జనగామ ఏసిపి పండరి చేతన్ నితిన్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా జిల్లా కేంద్రం లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ర్యాలీ నిర్వ హించి విద్యార్థులకు అవగాహన కల్పించా రు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు.

జిల్లాలో మాదకద్రవ్యాలు విని యోగం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్త్స్ర భరత్ కుమార్, చెన్నకేశవులు, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ వైస్ చైర్మన్ పర్వతాలు, మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్, కౌన్సిలర్లు పానుగంటి సు వార్త, సేవెల్లి మధు, మామిడాల రాజు, వేముల సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.