రెంకొని వాగును సందర్శించిన నిర్మల్ జిల్లా ఎస్పీ
సహాయక చర్యల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ శివారున ప్రవహిస్తున్న రెంకొనే వాగు(Renkoni Vagu) గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకి ఉప్పొంగి వంతెన కొట్టుకుపోయి రాకపోకులకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పరిస్థితులను గురువారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల(Nirmal District SP Janaki Sharmila) పర్యవేక్షించారు. మేరకు ఎస్పీ హైటెక్ సిటీ కాలనీ వద్ద ఉన్న వాగు పరిస్థితిని సమీక్షించారు. వాగులో ప్రవాహం తీవ్రంగా ఉండడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించి, అవతలి కాలనీవాసులకు పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వంతెన కొట్టుకుపోయిన స్థలంలో తగు రక్షణ చర్యలు ఏర్పాటు చేశామని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎస్పి తెలిపారు .ఆమె వెంట ఖానాపూర్ సిఐ అజయ్, ఎస్సై రాహుల్ గైక్వాడ్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, పలువురు ఉన్నారు.






