భారీ వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్త: కల్హేర్ ఎస్సై రవి గౌడ్
కల్హేర్ జులై 30(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల, మండల పరిధిలోని ప్రజలకు ఎస్సై రవి గౌడ్ హెచ్చరిస్తూ... నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని అన్నారు.
అలాగే శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండకూడదు అవి కూలీ పోయే ప్రమాదం ఉందని, సురక్షిత నివాసాలకు తరలివెళ్లాలి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉండే ఇండ్లలోకి వర్షపునీరు చేరకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు చెరువులు, వాగుల వద్ద వెళ్లరాదని, పిల్లలు, యువకులు వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టిసారించాలని, విద్యుత్ స్థంబాల వద్దకు, ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువులు, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ట్రాన్స్ ఫార్మర్లతో, కరెంటు మోటార్లతో జాగ్రత్త విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే తప్ప బయటకు రాకూడదాన్నారు. అత్యవసర ఉంటే పోలీస్ వారికీ లేదా డయల్ 100 నెంబర్ కి కాల్ చేయాలని ఎస్సై రవి గౌడ్ పేర్కొన్నారు.






