calender_icon.png 21 July, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్పుకుంటే కడుపు చెరువు

20-07-2025 12:29:02 AM

  1. పేరులోనే పులి.. అవకాశం ఉన్నకాడికి హరి
  2. ఉన్నోడే ఊడ్చేస్తుండు.. పట్టించుకునేటోడు కరువైండు..
  3. అప్పుడు నా ఆస్తి 66 ఎకరాలు.. ఇప్పుడు 6 లోపే..
  4. ఆ ఆరుకూడా ఆరగిస్తారంటూ ఆక్రందన
  5. మోతే మండలం కరక్కాయలగూడెం పులివారి చెరువు ఆత్మగోస (నట్టే కోటేశ్వర్ రావు) 

సూర్యాపేట, జూలై ౧౯ (విజయక్రాంతి): ‘మాది సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం కరక్కాయలగూడెం గ్రామం. మం డలకేంద్రం నుంచి మా  గ్రామం 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ ఊరిలో ఉన్న నాపే రు పులివారిచెరువు. నేను గాఊరికానుకుని ఉండి నా పేరు లో ఉన్నట్టుగనే వాళ్ల ను పులిలాగా బతికేట ట్లు జేసిన. ఎట్లజేసిన అంటరా ఇనుర్రి.. పూ ర్వమల్లా గీ ఊర్ని అలివేలు మంగాపురం అనేటోళ్లు.

అయితే ఈ ఊరికానుకుని కరక్కాయల చెట్టు ఉంటుండే.. అది మస్తుగా స్తుండే. దాన్నాసరాగా జేస్కునే అందరూ కరక్కాయలచెట్టు గూడెం అని పిలిచేటోళ్లు. అగో గదే రానురాను గానోటా, గీనో టా బడి మారి, మారి మధ్యలో చెట్టుబోయి, తరవాత కరక్కాయలగూడెంగా మారింది. ఇంగ ఎరుకైందిగా గీఊరికి గాపేరెట్ల అచ్చిం దో. ఆయాల్టి నుంచి గియాల్టీ వరకు గీఊర్ను గాపేర్తోనే పిలుస్తున్నరు. కానీ ఏంలాభం గీఊరోళ్లకు కృతజ్ఞతాభావమన్నదే లేదు..

ఎందుకంటున్నాననుకుంటున్నారా? ఇనుండ్రి అసల్కి ఒకప్పుడు 66 ఎకరాల మేర ఇస్తరించి ఉన్న నేను నా ఒంటి నిండా నీళ్లను నింపుకుని రెండు వందల ఎకరాలకు పైగా నీళ్లనందించి నాచుట్టూరా పచ్చని (పొలాలు) చీరను కట్టుకుని మస్తు అందంగా ఉండేదాన్ని. ఆనలు కురిస్తే పడ్డచినుకును పడ్డట్టు అట్లనే అందుకుని నాలో నింపుకుని రైతుల భూములకు నీళ్లు అందించి పంటసిరులు అందిచ్చేదాన్ని.

అందుకే గప్పట్లో ఊరు పెద్దోలంతా నా ముంగింట్లకచ్చి తల్లి నువ్వు నిండాలే మా పంటలు పండాలే మేం బాగుండాలే అని దండమెట్టుకునేటోళ్లు. రానురాను రోజులు మారినయ్ గీ మనుషులు మారిండ్రు. మాత మ్మి ‘శ్రీరాంసాగర్’ గాడు అచ్చినంక వాగుళ్ల, వంకలంట పడొచ్చి మా మనస్సుల ‘నీళ్లానం  దం’ నింపుతడనుకున్నం. కానీ మేం అనుకున్నదొకటి, అయ్యిందింకొకటి. గీడు అచ్చి భూముల రేట్లు మస్తుగ పెంచిండు.

ఎంకి పెం డ్లి సుబ్బిసావుకు అచ్చినట్లు గెప్పుడైతే గీ భూ ముల రేట్లు పెరిగినయో గప్పటినుంచి నన్నానుకుని భూములున్న ముదనష్టపోళ్లు నన్నాగమాగం జేస్తుండ్రు. ఇప్పుడొచ్చి ఎకరాకు ముప్పు లక్షలు అయింది. వీళ్ల మీదమట్టిబొయ్యా. 66 ఎకరాల మేర ఉన్న నన్ను  60 ఎకరాల మేర ఆక్రమించిం డ్రు.. నేను తరిగినట్లు గీళ్ల ఆస్తులు తరిగిపోను. అస లు లేనోళ్లు ఒకరిద్దరైతే ఏ మోలే బతికుండ్రని కడుపుల దాచుకుందు.

గానీ పెద్ద, పెద్ద భూసా ములే ఆక్రమిస్తుర్రు ఆళ్ల భూముళ్ల జి ల్లేర్లు మొలవ. కొందరు నా లో నీళ్లను మోటార్లుబెట్టి తోడి బోస్తుంటే మరికొందరు నాలో పలకు జేసీబీలు తోల్కచ్చి ఆళ్ల ఆస్తులు ఇక్కడున్నట్లు గజాలకొద్ది లోతుల బావులు తీసి పొలాలు బారిచ్చికుంటుర్రు. ఒకప్పుడు నిండనీళ్లు నింపుకుని పశు, పక్షాదులకు అండగుండడంతో పాటు చేపలు పెంచుతూ ఊరో ళ్లకు కూరగా గూడా వాటిని అందించేదాన్ని.. కానీ అవన్ని మరిచి నా మీదే కన్నుబడి నామరూపాలు లేకుండా జేస్తుండు ఈళ్ల కూరలు కుంపట్లేబడ.