17 July, 2026 | 4:27 AM

లక్ష్మీనరసింహులకు ఘనంగా నిత్యకైంకర్యాలు

06-06-2024 12:43 AM

యాదాద్రి భువనగిరి, జూన్ 5 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లో లక్ష్మీనృరసింహులకు బుధవారం నిత్య కైంకర్యాలు సంప్రదాయరీతిలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఉదయం గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అర్చన, అభిషేకం, అష్టోత్తర పూజలు జరిపారు. అనంతరం ఆలయం నుంచి లక్ష్మీనరసింహుల అలంకార ఉత్సవమూర్తులను గజ వాహనంపై ఊరేగిస్తూ ఉత్సవ మండపంలోని కల్యాణ వేదికపై అధిష్ఠింపజేశారు. సుదర్శన నారసింహ హోమం జరిపి ఆగమ శాస్త్రానుసారం నిత్యకల్యాణం జరిపారు. సాయంత్రం తిరువీధుల్లో లక్ష్మీనరసింహుల అలంకార సేవ జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి భక్తుల నుంచి వివిధ కైంకర్యాల ద్వారా రూ.27,46,342 ఆదాయం సమకూరింది.