2 May, 2026 | 7:01 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

నిజామాబాద్ జిల్లాను అగ్రగామిగా నిలపాలి

07-03-2026 12:24 AM

‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం’ విజయవంతం చేయాలి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క

అధికారులతో మంత్రి సన్నాహక సమావేశం

99 రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమ అమలుపై దిశా నిర్దేశం

నిజామాబాద్, మార్చి 6(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. 99 రోజుల పాటు చేపట్టనున్న ఈ కార్యక్రమం మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు కొనసాగనుంది.

ఇందులో భాగంగానే కార్యక్రమ అమలుపై నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నగర మేయర్ ఉమారాణి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, నిజమాబాద్ సీపీ సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఆయా శాఖల ఉమ్మడి జిల్లా అధికారులతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ మేరకు శుక్రవారం నిజమాబాద్ సమీకృత కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క కీలక సూచనలు చేశారు. 99 రోజుల పాటు పది ప్రత్యేక అంశాలపై చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ.. జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.  .నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడి తన సలహాలను వినిపించారు. 

కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర వింద్ , అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మేయర్ కె.ఉమారాణి,  సెక్యూరిటీ కౌన్సిల్ కన్వీనర్ డీసీపీ(అడ్మిన్ ) జి. బస్వా రెడ్డి, ట్రెజరర్ కే.సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కవిత రెడ్డి, ఎన్‌ఎస్‌సీ సభ్యులు కాకతీయ కాలేజ్ రజినీకాంత్, కామారెడ్డి ఏసీపీ చైతన్య రెడ్డి,  డీఎఫ్‌ఓ నిఖీత, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.