సివిల్స్ విజేతలకు సీఎం అభినందనలు
07-03-2026 12:25 AM
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి) : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రాష్ట్రం నుంచి విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సివిల్స్‌కు ప్రిపేరయ్యే పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తోంది. వీరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేసింది.
రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకం కోచింగ్ తీసుకున్న 202 మంది సివిల్స్ మెయిన్‌కు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 51మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయ్యారు. వీరిలో 20మంది అభ్యర్థులు సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలిచారు.




