గడబిడ వద్దు
- సర్ పేరిట బీజేపీ వివాదాలు సృష్టిస్తుంది
- ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి
- రాష్ట్రంలో బీజేపీ లేనే లేదు.. ఎంపీ ఎన్నికలప్పుడు వచ్చిన గాలి గత్తర వల్ల కొంత కనిపిస్తుంది
- సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ ఉన్న పార్టీ బీజేపీ: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా ‘కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి’ అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉన్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ను పక్కనపెట్టి, కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకువస్తారని తెలిపారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సంబంధించి ఎంపిక చేసిన బూత్ లెవెల్ అసిస్టెంట్ల(బీఎల్‌ఏ)తో కూడిన ఈ సమావేశంలో కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. సాధారణంగా జరిగే ఈ ప్రత్యేక ఓటర్ల వడపోత కార్యక్రమాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా అనేక వివాదాలు సృష్టించిందని కేటీఆర్ ఆరోపించారు.
కేవలం తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల ఓటర్లను, వారి మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ఈ సర్‌ను అడ్డగోలుగా వినియోగించడం వంటి అనేక ఆరోపణలను అటు బీహార్, బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో ఎదుర్కొన్నదన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి గడబిడలకు తావు లేకుండా.. బీజేపీ ఆటలు సాగకుండా, బీజేపీ అరాచకాలు నడవకుండా బీఆర్‌ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పార్టీ తరఫున ఎంపికైన బూత్ లెవెల్ అసిస్టెంట్లు, బీఎల్‌ఏలు ఒక్కరి ఓటు హక్కు కూడా అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కలిసి తొలగించకుండా కాపాడాలని సూచించారు. దీనికోసం ఎస్‌ఐఆర్‌పైన పూర్తి అ వగాహన కలిగి అవసరమైతే దీనికోసం మరోసారి బీఎల్‌ఏలకు పార్టీ తరఫున శిక్షణ సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ లేనే లేదని, కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చిన గాలి గత్తర వల్ల కొంత కని పిస్తుందన్నారు.
కేవలం సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ ఉన్న పార్టీ బీజేపీ అన్నారు. బీజేపీకి బిల్డప్ తప్పించి ఇంకేమీ ఉండదన్నారు. కేవలం ఒకరి పైన ఒకరికి ఉసిగొల్పాలన్న ఆలోచనలోనే బీజేపీ ఎప్పు డు ఉంటుందన్నారు. గతంలో కూడా ఎస్‌ఐఆర్ పైన తీవ్రమైన ఆరోపణలు వచ్చి నప్పుడు, ఎన్నికల కమిషన్‌కి పార్టీ తరఫున లేఖ రాసిన విషయాన్ని, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ పార్టీ ప్రతినిధుల బృందాన్ని స్వయంగా ఆహ్వానించింది అన్నారు.
ఆ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ను అత్యంత పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా, ఎవరికీ లాభం కలగకుండా నిర్వహించాలని సూచించామని కేటీఆర్ గుర్తుచేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న దొంగ ఓట్లు, డబుల్ ఓట్లను గుర్తించి తొలగించేలా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల వ్యవహారం వల్లనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎదురైన ఇబ్బందులను, ఓటమిని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇక హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్న కూల్చివేతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ నగరంలో కనీసం తాగునీటి సరఫరా, దోమల నియంత్రణ వంటి అంశాలను కూడా నిర్వహిం చలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నదన్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలి పామని, అందుకే హైదరాబాద్ నగర ప్రజ లు ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇయ్యకుండా పూర్తిగా మన పార్టీకే మద్దతు ఇచ్చారన్నారు.
కచ్చితంగా రానున్న రోజుల్లో నూ తెలంగాణ ప్రజలు మన పార్టీ గతంలో చేసిన అద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మరోసారి అవకాశం ఇస్తారని కేటీఆర్ భరోసా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి పార్టీ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ముందుకు పోతున్నారని, ఆయన రాజకీయాలతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపిన తీరు పైన కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అందరికన్నా ముందుగా ఎస్‌ఐఆర్ పైన పకడ్బం దీగా నిర్వహించిన కార్యక్రమం పట్ల కేటీఆర్ ప్రశంసించారు.
జాగ్రత్త వహించాలి: కేటీఆర్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా మన ఓటర్లను తొలగించకుం డా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. శనివారం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సిల్ రివిజన్(ఎస్‌ఐఆర్), పార్టీ సభ్యత్వ నమోదు కార్య క్రమాలపై ఇంఛార్జీలకు దిశానిర్దేశం చేశారు.
ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు నమోదు కాకుం డా ఖచ్చితమైన నిఘా ఉంచాలని చెప్పారు. అర్హులైన ప్రజల ఓటు హ క్కును కాపాడటంలో ప్రతి బూత్ స్థాయిలో బూత్ లెవెల్ అసిస్టెంట్లు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. కార్పొరేటర్ ఆశావహులు క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు, కంటోన్‌మెంట్ బోర్డు సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.






