13 April, 2026 | 4:32 PM

Breaking News

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతోనే అభివృద్ధి   •   పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •  

మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో సంఘ ప్రమేయం లేదు

25-02-2026 01:02 PM

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఇటీవల జరిగిన ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిమాణామాలలో పద్మశాలి సంఘం ప్రమేయం లేదని జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పద్మశాలి వర్గానికి చెందిన గుండా స్నేహ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం వారి యొక్క సొంత నిర్ణయం అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తమ సంఘంపై వేయడమే కాకుండా కొంతమంది పద్మశాలీలను బదనాం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజం తెలుసుకొని మాట్లాడాలని పేర్కొన్నారు. మీరు పార్టీల లో జరుగుతున్న గందరగోళంలోకి తమను తీసుకురావద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అనుమాండ్ల శ్రీకాంత్, అల్లే శ్రీకాంత్ ,గౌరవాధ్యక్షుడు  లింగయ్య ,కోశాధికారి ధర్మయ్య, నాయకులు ప్రకాష్, రమేష్, శ్రీనివాస్, సత్యనారాయణ ,తిరుపతి, ప్రవీణ్ తదితరులున్నారు.