ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో జాప్యం సహించేది లేదు
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో ఏళ్ల తరబడి జాప్యం సహించేది లేదని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఏళ్ల తరబడి నిర్మాణానికి నోచుకోని పశు వైద్య శాల నిర్మాణం పనులను సమీక్షించారు. దీనిలో ఎవరి నిర్లక్ష్యం ఉపేక్షించేది లేదని ఇకనైనా నిర్మాణం పనులు పూర్తి చేసి రైతులకు పశు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని వారు అన్నారు .పనులు జాప్యం వల్ల రైతులకు వైద్య సేవలు అందకుండా పోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్లు గుమ్ముల ఆనంద్, బొప్పారపు సత్యవతి, నాయకులు ప్రకాష్ గౌడ్, రాజ్ కుమార్, పశు వైద్య శాఖ ఏడిఏ రామకృష్ణుడు ఉన్నారు.






