1 May, 2026 | 4:02 PM

పరస్పర సహకారంతో ముందుకు వెళ్దాం

01-05-2026 03:11 PM

మెట్ పల్లి,మే1 (విజయక్రాంతి): కేసుల పరిష్కారంలో పరస్పర సహకారంతో ముందుకు వెళ్దాం అని మెట్ పల్లి జూనియర్ సివిల్ జడ్జి వి. మాధవి అన్నారు. శుక్రవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ, బార్ అండ్ బెంచ్ రిలేషన్ షిప్ పెంచుకోవడానికి తనవంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం న్యాయవాదులు సహకరించాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, సీనియర్ న్యాయవాదులు రాజ్ మహ్మద్, జిల్లా వెంకటేశ్వర్లు, మగ్గిడి వెంకట నర్సయ్య, కొండా ప్రవీణ్ కుమార్, సోమ భూమేశ్వర్, కోటగిరి వెంకటస్వామి, బర్ల లక్ష్మణ్, ఎండీ వలీయొద్దీన్, కంతి మోహన్ రెడ్డి, ఏలేటి నరేందర్ రెడ్డి, పోలకొండ దయాకర్ వర్మ, బద్దం లక్ష్మా రెడ్డి, పుప్పాల భానుమూర్తి, ఒజ్జెల శ్రీనివాస్, వేముల సునీల్, కటకం వేణుగోపాల్, తోగిటి రాజశేఖర్, పుప్పాల లింబాద్రి, జేడి సుధాకర్, తెడ్డు ఆనంద్, రాంపల్లి జగన్, నీరటి రమణ, కోటగిరి చైతన్య, మాలేపు సంధ్యా రాణి, పురుషోత్తం, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.