26 February, 2026 | 12:50 PM

ఎన్ని కేసులు పెట్టిన వెనుకడుగు వేసేది లేదు: గెల్లు

26-02-2026 12:00 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటూ రాజ్యాంగ నిబంధన లు అపహస్యం చేస్తుందని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు గెల్లు శ్రీనివాస్ అన్నారు. బుధవారం బీఆర్‌ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగబాలుతో కలిసి ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్ తో ములాఖత్ అయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... బాల్క సుమన్ అరెస్టు ప్రభుత్వ  కుట్ర లో భాగంగా స్పెషల్ పీ.పీ నీ ఏర్పాటు చేయడంఫై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టిన ఎన్ని అరెస్టులు చేసినా వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వి జిల్లా అధ్యక్షుడు బుట్టి శివ కుమార్, రమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.