17 June, 2026 | 11:50 AM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

ఉపాధ్యాయుడు లేక తెరుచుకొని పాఠశాల

26-02-2026 12:00 AM

బెజ్జూర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ ‘గిరిజన ప్రాథమిక పాఠశాల’ గత 25 రోజులుగా మూతపడినట్లు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పరదేశి జనవరి 31న పదవీ విరమణ పొందడంతో, అప్పటి నుంచి పాఠశాలకు కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడం వల్ల విద్యా బోధన జరగడం లేదన్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత మండల విద్యాధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఉన్నతాధికారులుచర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.