11 March, 2026 | 9:28 AM

రోడ్లపై చెత్తకు ఇక చెక్!

09-03-2026 12:00 AM
  1. హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాచరణ
  2. జీవీపీ పాయింట్ల తొలగింపుపై దృష్టి 
  3.   99 రోజుల ప్రణాళికలో పారిశుద్ధ్యానికే పెద్దపీట

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగం గా.. మహానగరంలో రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్న చెత్తకుప్పలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్ అడుగులు వేస్తోంది. ఇందులో ప్రధానంగా నగరంలో ఏళ్ల తరబడి ఇబ్బంది పెడుతున్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది.

ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, కాలనీలు, ఖాళీ స్థలాలు, చెరువు లు, కుంటల జలవనరులు వద్ద ప్రజలు ఇష్టారాజ్యంగా చెత్తను పడేయకుండా నిరోధించేందుకు అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పతి ఇంటి వద్ద నుంచే చెత్తను సేకరించి, అక్కడినుంచి నేరు గా వ్యర్థాల నిర్వహణా కేంద్రాలకు తరలించే విధంగా పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని వివిధ జీవీ పీ పాయింట్ల వద్ద పేరుకుపోతున్న సాధారణ చెత్తతో పాటు, నిర్మాణ వ్యర్థాలను ప్రతి రోజూ ఉదయం 9 గంటలలోపే కచ్చితంగా తొలగించేలా పారిశుద్ధ్య సిబ్బందికి స్పష్టమై న ఆదేశాలు జారీ చేశారు.

ఎక్కడైతే ఏళ్ల తరబడి ప్రజలు చెత్త వేస్తున్నారో, ఆయా ప్రదేశా లను జీవీపీలను పూర్తిగా శుభ్రపరిచి.. తిరిగి అక్కడ ఎవరూ చెత్త వేయకుండా ఆ ప్రాం తంలో అందమైన ముగ్గులు వేస్తున్నారు. పరిశుభ్రతతో పాటు దోమల నియంత్రణ ఎంటమాలజీ చర్యలను సైతం ముమ్మరం చేశామని, తద్వారా రాబోయే రోజుల్లో సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నా మని బల్దియా వర్గాలు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా జోనల్ కమిషనర్లు, డీఎంసీలు, ఏఎంఓహెచ్లు, పారిశుద్ధ్య సిబ్బందికి ఆయన ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. 

మహిళా కార్మికులకు సత్కారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ జీహెచ్‌ఎంసీ ఘన సన్మానం

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 8 (విజయక్రాంతి) : హైదరాబాద్ నగర పరిశు భ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా పా రిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని జీహెచ్‌ఎంసీ కొనియాడింది. అంతర్జాతీయ మ హిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి ని బల్దియా ఆదివారం ఘనంగా సత్కరించింది.

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ఆధ్వ ర్యంలో నగరంలో నారీ లెడ్ స్వచ్ఛత కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం యూసుఫ్గూడ సర్కిల్ పరిధిలోని జయప్రకాశ్ నగర్‌లో మహిళా కార్మికులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌ను అందంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో గొప్పదన్నారు.