29 June, 2026 | 1:13 AM

నేపాలీలపై అనవసర భయాందోళనలు వద్దు

29-06-2026 12:49 AM

తెలంగాణ నేపాలీస్ వెల్ఫేర్ అసోసియేషన్

ముషీరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని దాడులు, దొంగతనాల ఘటనల నేపథ్యంలో నేపాలీలపై అనవసర భయాందోళనలు పెంచుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ నేపాలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రతన్ సింగ్ కర్మ, ప్రధాన కార్యదర్శి టి.బండారి తెలిపారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అసోసియేషన్ మహాసభలో వారు మాట్లాడారు. అసోసియేషన్ జారీ చేసే గుర్తింపు కార్డుల ద్వారా నేపాలీల వివరాలను ధృవీకరించవచ్చని పేర్కొన్నారు.

ఇళ్లలో, సంస్థల్లో ఉద్యోగాలకు నియమించుకునే ముందు అసోసియేషన్ ఐడీ కార్డును పరిశీలించాలని సూచించారు. అనుమానాలు ఉంటే 8500458686, 8099060996, 9440508451 నంబర్లను సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలోని నేపాలీల వివరాల నమోదుకు త్వరలో ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భీం బహదూర్, ప్రభు, ప్రేమ్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.