26 August, 2026 | 8:09 PM

ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరి మృతి

26-08-2026 07:28 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన కత్తుల చిన్నస్వామి అనే వ్యక్తి ప్రమాద వశాత్తు మృతి చెందినట్లు అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ నెల 24న సాయంత్రం అంకాపూర్ నుంచి అర్మూర్ వెళుతుండగా గుండేటి మహిపాల్ వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం బావిలో శవం తేలడంతో చిన్నస్వామిగా గుర్తించినట్లు  పేర్కొన్నారు. మృతుని భార్య కత్తుల లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వివరించారు.