13 March, 2026 | 4:58 AM

ఎల్పీజీ నిల్వలపై ఆందోళన వద్దు

13-03-2026 01:12 AM

అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి 

రంగారెడ్డి, మార్చి 1౨( విజయక్రాంతి): పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన భయాందోళనల నేపథ్యంలో, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి  జిల్లాలోని ఎల్పిజి గ్యాస్ డీలర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం స్థానిక సరఫరాపై పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీలర్లను ఆదేశించారు. జిల్లాలో ఎల్పిజి సిలిండర్ల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తగినంత స్టాక్ను నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

యుద్ధ వార్తల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంలో నిజం లేదు. జిల్లాలో సరిపడా ఎల్పిజి నిల్వలు ఉన్నాయి. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు, అనవసరంగా స్టాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు‘ అని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులు మరియు జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.