యాదగిరిగుట్టలో గవర్నర్
లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న శివప్రతాప్ శుక్లా
యాదగిరిగుట్ట, మార్చి 12 (విజయక్రాం తి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని గురువారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో భవానీ శంకర్ ఆయనకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు.
గవర్నర్‌కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, రెవె న్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి గవర్నర్‌కు పూల మొక్కలు బహుకరించి స్వాగతం పలికారు. అనంతరం అనుబంధ ఆలయం శ్రీ పర్వత వర్ధిణి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్పటిక లింగానికి గవర్నర్ దంపతులు అభిషేకం చేశారు.




