calender_icon.png 24 February, 2026 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా పేరుతో సంస్థలకు అనుమతిలేదు

24-02-2026 01:37:49 AM

  1. ఎవరైనా బీఆర్‌ఎస్ పార్టీలో కలిసి పనిచేయాలి
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): తన పేరుతో ఎలాంటి సంస్థను ఏర్పాటుచేసేందుకైనా తన అనుమతి లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది ‘కేటీ ఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి పలువురు తీసు కొచ్చారు. దీనితోపాటు కేటీఆర్ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అం శాన్ని కూడా కేటీఆర్‌కి తెలియజేశారు.

ఈ నేపథ్యంలో తన పేరుతో ఎలాంటి సంస్థలకీ అనుమతిలేదని.. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదన్న విష యా న్ని అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చే శారు.

ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా బీఆర్‌ఎస్ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని కేటీఆర్ తెలిపారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఆపేయాలని.. తనపై అభిమానం ఉన్నవాళ్లు ఎవ రైనా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)తో కలి సి పనిచేయవచ్చని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.