19 May, 2026 | 3:06 PM

విద్యా, వైద్యంపై రాజకీయాలు వద్దు

10-11-2024 12:15 AM

ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు 

మంచిర్యాల, నవంబర్ 9 (విజయక్రాంతి): విద్యా, వైద్యంపై బీఆర్‌ఎస్ నాయ కులు రాజకీయం చేయడం మానుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసా గర్‌రావు అన్నారు. శనివారం కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి వాడ సాయికుంటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురైన పదవ తరగతి విద్యార్థులను పరామర్శించారు. అనంతరంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. తమ ప్రభుత్వం హాస్ట ల్ పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నదన్నారు. అస్వస్థ తకు గురైన విద్యార్థినులకు వైద్యం అందిం చామన్నారు. దీనిపై బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయం చేయడం తగదన్నారు.