ఊక దంపుడు ఉపన్యాసాలు వద్దు..
మీ పాత స్పీచ్‌లు.. వైఫల్యాలను కప్పిపుచ్చలేవు !
మీ నిర్ణయాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం
ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఫైర్
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ‘మీ పాత స్పీచ్‌లు.. వైఫల్యాలను కప్పిపుచ్చలేవు. మీరు తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలు దేశానికి శాపంగా మారాయి. ఇకనైనా ఊక దంపుడు ఉపన్యాసాలు మానేయండి. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పకండి. 2013 14తో పోలిస్తే గృహ సంబంధిత ఖర్చులు 241 శాతం పెరిగాయి.
జీడీపీలో దేశీయ రుణం గతంలో ఎప్పుడూ లేని విధంగా పెరిగింది. కొవిడ్ సమయం నుంచి ప్రతి ఇంట్లో ఆదాయం కంటే ఖర్చు బాగా పెరిగింది’ అని ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదివారం ‘ఎక్స్’ ద్వారా ఫైర్ అయ్యా రు. దేశ ప్రజలపై మోయలేని గృహ రుణ భారం ఉందన్నారు.
నిత్యావ సర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా పథకం వందకు వందశాతం విఫలమైందని ఆరోపించారు. రెండు దఫాలుగా కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీనే అందుకు కారణమని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అసంఘటిత రంగాన్ని సర్వనాశనం చేయడంతోనే ఇలాంటి పరిస్థితులు దాపురించా యని ఆరోపించారు.
యూపీఏ హయాంలో భారత్‌కు ఎగుమతుల ద్వారా భారీగా ఆదా యం వచ్చేదని, ఆ విధానాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించడంతోనే దేశంలో ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని అభిప్రాయపడ్డారు.






