ఆరో తోడేలునూ చంపేశారు
బహరాయిచ్, అక్టోబర్ 6: యూపీలోని బహరాయిచ్ జిల్లాను వణికిస్తున్న ఆరో తోడేలును గ్రామస్థులు మట్టుబెట్టారు. శనివారం తమాచ్ పుర్ గ్రామంలో మేకను వేటాడేందుకు వచ్చిన తోడేలును గ్రామస్థు లు కొట్టి చంపినట్లు అధికారులు పేర్కొన్నారు. మహసి ప్రాంతంలో మార్చి నుంచి తోడేళ్లు వరుసగా మనుషులపై దాడులు చేస్తున్నాయి. తోడేళ్ల దాడుల్లో ఇప్పటివరకు 9 మంది మృతిచెందగా, 40 మందికిపైగా గాయపడ్డారు.
మొత్తం ఆరు తోడేళ్ల గుంపు సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారు లు వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ భేడియాను ప్రారంభించారు. ఉచ్చులు, బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల సాయం తో నిఘావేశారు. తోడేళ్లు ఎప్పటికప్పుడు స్థావరాలను మార్చుకుంటూ వచ్చాయి.
దీంతో తోడేళ్లను పట్టుకోవడం సాధ్యం కాకుంటే వాటిని కాల్చేయాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఐదో తోడేళ్లను గత నెల 10వ తేదీన అధికారులు బంధించారు. చివరి తోడేలును పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా తాజాగా అది మృతి చెందింది.






