8 March, 2026 | 3:26 PM

Breaking News

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •  

అశోక్ కాలనీలో వైన్స్ షాప్ వద్దు

29-11-2025 08:49 PM

అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ మెయిన్ రోడ్డులో నూతనంగా పెడుతున్న వైన్స్ షాపు ను రద్దు చేయాలని అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 032 నెంబర్ వైన్స్ షాపును ప్రారంభించకూడదని హైకోర్టు స్టే ఆర్డర్ నెంబర్ డబ్ల్యూపి 36549 ఆఫ్ 2025ను పాస్ చేయడం జరిగిందని తెలిపారు. శనివారం ఆర్డర్ ప్రతులను వైన్స్ షాపు పెట్టబోయే భవనమునకు అంటించారు. అలాగే స్టే ప్రత్తులను ఎక్సైజ్ జిల్లా అధికారికి, స్థానిక ఎక్సైజ్ సిఐకి, మున్సిపల్ కమిషనర్ కి, జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం  అందించడం జరిగిందన్నారు.

వైన్స్ షాపు తెరవ కూడదని సంబంధిత ఇంటి ఓనర్ కు, వైన్ షాప్ ఓనర్ అబ్బు లతకి తెలియజేయడం జరిగిందని అన్నారు. అనంతరం అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు వెంకటరాజారెడ్డి, అధ్యక్షులు మందల కృష్ణరెడ్డిలు మట్లాడుతూ... అశోక కాలనీ ఇతర కాలనీలకు ఆదర్శవంతమైన కాలనీ అని వైన్ షాపులు ఉండకూడదని ప్రజలకు ఇబ్బంది కలుగుతయని, అలగే మెయిన్ రోడ్డు చాలా రద్దీ ప్రాంతమని ట్రాఫిక్ రీత్యా ఇబ్బందులు జరుగుతాయని, చుట్టుపక్కల నివాసాలు ఉంటున్న కుటుంబాలకు ఇబ్బందికరంగా ఉంటుందని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారని వారికి ఇబ్బంది కలుగుతయాని, వైన్ షాపు నిర్వహించకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ, దేవాలయం కమిటీ ల కార్యదర్శిలు రామచందర్, సరోతంరెడ్డి, కమిటీ సభ్యులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.