15 June, 2026 | 7:37 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ఫిఫా వరల్డ్‌కప్ ఆరంభ వేడుకల్లో నోరా

10-05-2026 12:48 AM
  1. ఆడిపాడనున్న బాలీవుడ్ స్టార్
  2. పాప్ స్టార్స్‌తో ఓపెనింగ్ సెర్మనీ

న్యూజెర్సీ, మే 9 : ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీ ఫిఫా ప్రపంచ కప్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. మరో నెలరోజుల్లో ఆరంభం కానున్న ఈ మెగాటోర్నీ కోసం సాకర్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఫిఫా వరల్డ్‌కప్‌కు మూడు దేశాలు అమెరికా, మెక్సికో, కెన డా ఆతిథ్యమిస్తున్నాయి. దీంతో మూడు వేర్వేరు నగ రాల్లో భారీ ఎత్తున ప్రారంభ వేడుకలను నిర్వహించాలని ఫిఫా నిర్ణయించింది. ఈ వేడుకల్లో అంతర్జాతీయ పాప్ సింగర్ కేటీ పెర్రీతో పాటు బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ నోరా ఫతేహీ తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. జూన్ 12న కాలిఫోర్నియాలోని సోఫీ స్టేడియంలో అమెరికా తన తొలి మ్యాచ్‌లో పరాగ్వేతో తలపడనుంది.

ఈ మ్యాచ్‌కు ముందు జరగబోయే భారీ వేడుకలో ప్ర పంచ ప్రఖ్యాత సింగర్ కేటీ పెర్రీ తన గాత్రంతో ఉర్రూతలూగించనుంది. ఆమెతో పాటు ర్యాపర్ ఫ్యూచర్, లీసా, టైలా, అనిట్టా, రేమా వంటి గ్లోబల్ స్టార్స్ కూడా ఇదే వేదికపై సందడి చేయనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఈ సాం స్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఉ ర్రూతలూగించనున్నాయి. టోర్నమెంట్ అధికారి కంగా జూన్ 11న మెక్సికో సిటీలోని చారిత్రాత్మక ఎజ్టెకా స్టేడియంలో ప్రారంభ మవుతుంది.

ఇక్కడ మెక్సికో, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ప్రా రంభ వేడుకలో లాటిన్ సంగీతానికి పెద్దపీట వేశారు. జే బాల్విన్, అలెజాండ్రో ఫెర్నాండెజ్, డానీ ఓషన్ వంటి ప్రముఖులు ఇక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే దక్షిణాఫ్రికా సింగర్ టైలా తన పాటలతో మెక్సికోలో సెగ పు ట్టించనుంది. కెనడాలో జరగబోయే ఓపెనింగ్ మ్యాచ్‌లో టొరంటోలోని బీఎంఓఫీల్ వేదికగా బోస్నియా, హెర్జెగోవినా జట్లు తలపడనున్నాయి.

ఈ వేడుకను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు కెనడాకు చెం దిన మైఖేల్ బుబ్లే, అలానిస్ మోరిసెట్, అలేసియా కారాలతో పాటు బాలీవుడ్ సెన్షేషన్ నోరా ఫతేహీ తన డ్యాన్స్‌తో అదరగొట్టనుంది. ఈసారి 48 జట్లు పాల్గొంటున్న అతిపెద్ద టోర్నమెం ట్ కావడంతో వినోద కార్యక్రమాల స్థా యి ని కూడా ఫిఫా భారీగా పెంచింది.౩ దేశాల్లో జరిగే ప్రారంభ వేడుకలు మ్యాచ్‌లకు 90 నిమిషాల ముందే ప్రా రంభమ వుతాయి. ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు జూన్ 11న ప్రారంభం కానున్నాయి. ఫిఫా వరల్ కప్‌లో ఇప్పటి వర కు 32 దేశాలే పాల్గొంటుండగా.. ఈసారి 48 దేశాలు పొటీ పడుతున్నాయి.